ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ రాళ్లదాడిని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రజలకు టీడీపీ నేతలు కొత్త విధానాలను పరిచయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ నేతలు ఎక్కడా తిరగకూడదా ...టీడీపీ నేతలే ..కార్యకర్తలే తిరగాలా అని ప్రశ్నించారు. ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ మూకల దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చేశారని, ప్రజల అవసరాలను పక్కన పెట్టి ఇతర రాజకీయ పార్టీల నాయకుల పై దాడులు చేస్తున్నారని విమర్శించారు.‘దాడులు , హత్యలు, మానభంగాలతో ఏపీ అట్టుడికిపోతోంది. పట్టపగలే హత్యలు చేస్తున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? ఎంపీ మిథున్ రెడ్డిని ముట్టడించి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? వైయస్ఆర్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు ఏనాడైనా జరిగాయా? తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలి. కేంద్రహోంశాఖ ఏపీలో శాంతి భద్రతల పై స్పందించాలి. 40 రోజుల నుంచి రాష్ట్రంలో దాడులతో రెచ్చిపోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏమైపోయారు...ఎందుకు స్పందించడం లేదు. పోలీసు యంత్రాంగం నిర్లిప్తంగా ఉంది. ప్రజా ప్రతినిధులకు గన్ మెన్లను విత్ డ్రా చేసి శాంతిభద్రతలకు మీరే విఘాతం కలిగిస్తున్నారు. చంద్రబాబు గడచిన 40 రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా కలిపి శ్వేత పత్రం విడుదల చేయాలి. పక్షంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడుల పై మేమే శ్వేతపత్రం విడుదల చేస్తాం అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa