చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మిధున్‌రెడ్డిపై దాడి అమానుషం అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, అన్నారు. ఆయన మాట్లాడుతూ.... ఎంపీ పై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు అని అన్నారు.