ధర్మవరం పట్టణం పేట బసవన్న కట్టలో గల త్రిలింగేశ్వర దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ. గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆలయంలో మహాశయా ఏకాదశి మహా రుద్రాభిషేకం, వివిధ రకాల పూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం గురువులకు శిష్యులు పాదాభివందనం చేశారు.