బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కురిసిన వర్షాలకు వాగులు, వంకల్లో వరద నీరు మంగళవారం నాటికి శాంతించింది. సంతకవిటి మండలంలోని ప్రధాన కాలువైన సాయన్న గడ్డ, ఎండువానిబట్టి, నారాయణపురం కుడి ప్రధాన కాలువ, మడ్డువలస కాలువల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో 200 క్యూసెక్కుల నీటిని నీటి పారుదల అధికారులు ముందుగానే నదిలోకి విడిచిపెట్టారు.