ప్రభుత్వ భూమి 900 వందల ఎకరాలు ఆక్రమణ చేశారు. అక్రమాలు వెలుగులోకి వస్తాయని వైసీపి నాయకులు ఆర్డీవో కార్యాలయం దగ్ధం చేశారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుకుంట రమేష్ నాయుడు మంగళవారం ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మెతక వైఖరి వీడి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.