అగ్ని ప్రమాదానికి గురైన మదనపల్లి ఆర్డీవో కార్యాలయంను అన్నమయ్య జిల్లా రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు చమర్తీ జగన్మోహన్ రాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ ఘటనలో వైసీపి నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉంటుందని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేశారు.