ఆధార్ కార్డులో మార్పుచేర్పులు చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని మంగళవారం జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ఆధార్ లో మార్పులు, సవరణలు చేస్తామంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తమ దృష్టికి వచ్చిందని వాటిపై నిఘా పెట్టీ వుంచుతామన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో తప్పా ఆధార్ లో మార్పులు సవరణలు చేసేందుకు అవకాశం లేదని ప్రజలు మోసపోవద్దని కోరారు.