ప్రభుత్వ ఆదేశాల మేరకు నార్పల మండల పరిధిలో ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం ఎంపీడీఓ రాముడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ఆధార్ శిబిరాల ఏర్పాటులో భాగంగా మండల పరిధిలోని గూగూడు, నాయన పల్లి సచివాలయ పరిధిలో ప్రత్యేక ఆధార్ కేంద్రాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజల ఆధార్ కార్డులో ఉన్న మార్పుల చేర్పులను చేపట్టారు.