పంజాబ్లోని లూథియానాలో తాజాగా జరిగిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన సహోద్యోగి మైనర్ కుమార్తె (13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జులై 14 న జరిగినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.