శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోనే శివాపురం యాదవ్ కాలనీ ను బుధవారం మున్సిపల్ కమిషనర్ రంగస్వామి పరిశీలించారు. రెండు నెలలుగా బోరు మరమ్మత్తుకు గురు కావడంతో నీటి సౌకర్యం నిలిచిపోయిందని మున్సిపల్ కమిషనర్ కు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని కాలనీవాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టిడిపి కౌన్సిలర్ శ్రీనివాసులు ఉమా శంకర్ పాల్గొన్నారు.