ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దిరెడ్డి ఇంటి వద్ద గేట్లను తెరిచి ఉంచాల్సిందే.. ఏపీ హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 07:43 PM

తిరుపతిలోని పెద్దిరెడ్డి ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా పెట్టిన గేట్లు తెరిచి ఉంచాలని.. ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఆదేశించింది. ఆ గేట్లను మూసివేయకూడదని.. ఒకవేళ పెద్దిరెడ్డి ఆస్తికి భద్రతాపరమైన సమస్యలు ఉంటే.. రక్షణ కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు సూచించింది. ఆ దరఖాస్తును పరిశీలించి, నిబంధనల మేరకు అధికారులు చర్లు తీసుకోవాలని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు తాజాగా బయటకు వచ్చాయి.


తిరుపతిలోని మారుతీనగర్‌ నుంచి రాయల్‌నగర్‌ మెయిన్ రోడ్డులో రెండు వైపులా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గేట్లు ఏర్పాటు చేసి అటువైపు ప్రజల్ని అనుమతించలేదు. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ నేత కిరణ్‌రాయల్‌తో పాటు కార్యకర్తలు, ప్రజలు ధర్నాకు దిగారు.. ఆ గేట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్‌ అధికారులను పెద్దిరెడ్డి ఇంటి గేట్లపై నివేదిక అడిగారు. అప్పుడు అధికారులు ఆదేశాలను పరిశీలిస్తే.. తిరుపతిలోని 18వ డివిజన్లోని మారుతీనగర్‌-రాయల్‌ నగర్‌ను కలిపేందుకు సీసీ రోడ్డు వేస్తున్నట్టు రూ.9.55లక్షలు.. రూ.9.50లక్షలతో రెండు విడతలుగా నామినేటెడ్‌ కింద టెండర్ అప్పగించారు. స్థానికులు వినతి మేరకు రాయల్‌నగర్‌ నుంచి మారుతీనగర్‌ను కలుపుతూ రోడ్డు వేస్తున్నట్లు కార్పొరేషన్‌ రికార్డులో నమోదు చేసినట్లు గుర్తించారు.


ఈ వ్యవహారంపై పెద్దిరెడ్డి కుటుంబం ఈ నెల 8న హైకోర్టును ఆశ్రయించింది. ఆ స్థలంలో నిర్మించిన సిమెంట్ రోడ్డును, రక్షణ కోసం నిర్మించిన గేటును తొలగించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. కార్పొరేషన్‌ నిధులతో ఈ సీసీ రోడ్డు నిర్మించారని, అందుకు ఖర్చు చేసిన మొత్తాన్ని తాము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. పిటిషనర్ల ప్రైవేట్ ఆస్తి విషయంలో తొందరపాటు చర్యలు వద్దని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 10కి కేసు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ నెల 10న ప్రభుత్వం తరఫున లాయర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా.. పెద్దిరెడ్డి ఇంటి దగ్గర గేట్లు మూసివేయకుండా చూడాలని హైకోర్టు ఉత్తర్వుల్ని సవరించింది. ప్రతివాదులు కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి 4 వారాలకు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 15న ఉత్తర్వులు వచ్చాయి.. అయినా సరే పెద్దిరెడ్డి ఇంటి గేట్లు మాత్రం ఓపెన్ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. మరి కొత్తగా వచ్చిన కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa