రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎన్జీవో సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని నేషనల్ హైవే ఆర్వో ఆర్.కె.సింగ్ సూచించారు. బుధవారం నేషనల్ హైవే కార్యాలయంలో రోడ్డు భద్రతా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని, రోడ్డు ప్రమాదాలలో వాహనదారులు మరణిస్తూ ఉన్నారని దీని నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎన్జీవో సంస్థలు ముందుకు రావాలని అన్నారు. రోడ్ సేఫ్టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కె. దుర్గ పద్మజ, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతీయ అధ్యక్షుడు బేతు రామమోహనరావు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.