ఎవరూ కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదని కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత సూచించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్డీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మత్తుపదార్థాలైన ఆల్కహాల్, పొగాకు, గంజాయి లాంటివాటి వినియోగం వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తలెత్తుతాయన్నారు. ముఖ్యంగా యువత వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వాటికి అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. కనుక వాటి జోలికి ఎవరూ వెళ్లరాదని సూచించారు. ప్రిన్సిపాల్ మల్లికార్జున , సర్కిల్ ఇన్సపెక్టర్ హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్ల జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. అప్పడే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఎనఎ్‌సఎ్‌స ప్రొగ్రామ్ ఆఫీసర్ వెంకటేష్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.