కర్నూలుకలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్లు రవితేజ, ఫిరోజ్ ఫిర్యాదులపై త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు ఆసుపత్రి సూరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విచారణ కమిటీలో ఏఆర్ ఎంవో వెంకటరమణ, ఏవో శ్రీనివాసులు, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రీ బాయి ఉన్నారన్నారు. విచారణ నేపథ్యంలో ఇద్దరు సెక్యూరిటీ సూపర్వైజర్లను ఆసుపత్రి ఆవరణలోనికి రానివ్వవద్దని సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్వోను ఆదేశించినట్లు తెలిపారు.