ప్రకృతి వ్యవసాయం భావితరాలకు ఆదర్శం కావాలని జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ అన్నారు. బుధవారం సంజామల మండలంలోని ముదిగేడు, ముక్కమళ్ల, ఆకుమళ్ల, ఆర్.బి.కే కేంద్రాల్లో ఆయన అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ప్రస్తుత కరీఫ్ సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉండి సూచనలు, సలహాలను ఇవ్వాలన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసే పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్.బి.కె కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. అనంతరం ఆకుమళ్ల శివార్లలోని శింగనపల్లె సమీపంలో 4ఎకరాల్లో 22 రకాల విత్తనాలతో సాగు చేసిన ప్రకృతి వ్యవసాయ పంటలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ నరేంద్ర రెడ్డి, కోవెలకుంట్ల ఎ.డి.ఎ సుధాకర్, వ్యవసాయ అధికారులు సుధాకర్ రెడ్డి, అబ్దుల్ హక్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు దివ్య, బాషా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.