సంగాం జడ్పీ ఉన్నత పాఠ శాలలో మధ్యాహ్న భోజన నిర్వహణపై బొబ్బిలి డిప్యూటీ డీఈవో మోహన రావు బుధవారం విచారణ నిర్వహించారు. నిర్వాహకులు సరిగా వంటలు చేయ కపోగా పరిశుభ్రత పాటించ డంలేదని గ్రామానికి చెందిన చిగిరి నరినర్శింహులుతో పాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ డీఈవో పాఠశాలను సందర్శించారు. ఫిర్యాదుదారుడు, వంట నిర్వాహకులను వేరువేగా విచారించారు. వంటలనాణ్యత పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం నిర్వహణలో అలసత్వం వహించరాదని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌కు ఆదేశాలు జారీచేశారు. దర్యాప్తు నివేదికలు ఉన్నతదికాలుకు అందజేస్తానన్నారు. అనంతరం వంగర జెడ్పీలో విద్యా ర్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు చిన్నచిన్న లఘు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఎంఈవో దుర్గారావు, నాగభూషణదొర తదితరులు ఉన్నారు.