రంపచోడవరం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న పొలిటికల్ సైన్స్ లెక్చరర్ పోస్టును గెస్ట్ లెక్చరర్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ రవికుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ విద్యార్హతలతో ఈ నెల 29వ తేదీ లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.