జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌలు రైతులకు కూడా బ్యాంక్ క్రాఫ్ రుణాలు మంజూరు చేయనున్నట్లు పెద్దారవిడు మండల వ్యవసాయాధికారిని కె. బుజ్జిబాయి అన్నారు. క్రాఫ్ లోన్ మంజూరు చేయాలని ఇచ్చిన జీవో ను ఆమె శుక్రవారం కెనెడా బ్యాంక్ మేనేజర్ కు అందజేశారు. రైతులు రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చే కౌలు కార్డులను తీసుకొని రుణాలు పొందాలని సూచించారు.