ఏపీలో పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ-గూడూరు మూడో లైన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. విజయవాడ-న్యూ వెస్ట్ బ్లాక్ హట్ మధ్య ప్రీ నాన్ ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కూడా నడుస్తున్నాయి. ఈ కారణంగానే ఆగస్టు 5 నుంచి 12 వరకు రైళ్లను రద్దు చేశారు. విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 37 రైళ్లను రద్దు చేయగా.. మరో 38 రైళ్లను దారి మళ్లించారు. రైల్వేశాఖ రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప-విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487-88), విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ (12713-14), హుబ్లీ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ (17329-30), విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్ (12711), చెన్నై సెంట్రల్-విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12077-78) రైళ్లు రద్దు చేశారు. డోర్నకల్-విజయవాడ (07755), విజయవాడ-డోర్నకల్ (07756).. విజయవాడ-భద్రాచలంరోడ్ (07979), భద్రాచలంరోడ్-విజయవాడ (07278) రైళ్లను ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు.
గుంటూరు-సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్-గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్.. విజయవాడ-సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్-విజయవాడ (12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగస్టు 5 నుంచి 10 వరకు రద్దు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్నం గోదావరి, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి, సికింద్రాబాద్-గూడూరు సింహపురి, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) కూడా రద్దు చేశారు.
విశాఖపట్నం-షిర్డీసాయినగర్ (18503), షిర్డీసాయినగర్-విశాఖపట్నం (18504), విశాఖపట్నం-న్యూఢిల్లీ (20805), న్యూఢిల్లీ-విశాఖపట్నం(20806), విశాఖపట్నం-హైదరాబాద్ (12727), హైదరాబాద్-విశాఖపట్నం (12728), విశాఖపట్నం-నిజామాబాద్ (12803), మచిలీపట్నం-షిర్డీసాయినగర్(17208), షిర్డీ సాయినగర్-మచిలీపట్నం (17207), విశాఖపట్నం-లోకమాన్యతిలక్ టెర్మినల్ (18519), లోకమాన్యతిలక్ టెర్మినల్-విశాఖపట్నం (18520), విశాఖపట్నం-సికింద్రాబాద్ (12739), సికింద్రాబాద్-విశాఖపట్నం (12740), విశాఖపట్నం-గాంధీనగర్ (20803), గాంధీనగర్-విశాఖపట్నం (20804) రైళ్లు రద్దయ్యాయి.
నర్సాపూర్-నాగర్‌సోల్ (12787), నాగర్‌సోల్-నర్సాపూర్ (12788), మచిలీపట్నం-బీదర్ (12749), బీదర్-మచిలీపట్నం (12750), హైదరాబాద్-షాలిమార్ (18046), షిర్డీసాయినగర్-కాకినాడ పోర్టు (17205), కాకినాడ పోర్ట్-షిర్డీసాయినగర్ (17206), షాలిమార్-హైదరాబాద్ (18045),పూరి-ఓఖా (20819), ఓఖా-పూరి (20820), నిజాముద్దీన్- విశాఖపట్నం(12804), ఛత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ (11019), భువనేశ్వర్ -ఛత్రపతి శివాజీ టెర్మినల్ (11020), యశ్వంత్‌పూర్-టాటా (18112), టాటా-యశ్వంత్‌పూర్ (18111), హైదరాబాద్-తాంబరం (12760) రైళ్లు రద్దయ్యాయి.
మరోవైపు గుంతకల్-బీదర్ (07671) ఆగస్టు 1-31 వరకు, , కాచిగూడ-గుంతకల్ (07670) ఆగస్టు 2-సెప్టెంబర్ 1, కాచిగూడ-రాయచూర్ (17693) ఆగస్టు 1-31 వరకు రద్దయ్యాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. అందుకు తగిన విధంగా జర్నీ ప్లాన్ చేసుకోవాలని రైల్వే అదికారులు తెలిపారు. కొన్ని నెలలుగా విజయవాడ డివిజన్ పరిధిలో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి.. దీంతో రైలు ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.