జగనన్న కాలనీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నర్సాపురం యువజన సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలాకి స్థానిక సచివాలయం వద్ద సంబంధిత అధికారు లను నిలదీశారు. అక్రమాల పై గతంలో అనేక పర్యాయాలు ఫిర్యాదు లు చేసినా అధికారులు పట్టించు కోలేదని ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎవరూ లేకపోవడం తో సచివాలయానికి వెళ్లి వీఆర్వో శ్రీనివాసరావును కలిసి సమస్యలను విన్నవించామని యువజననాయకులు శ్యామలరావు, పి.రామకృష్ణ, వెంకటి తెలిపారు. నర్సాపురంలో ఇచ్చిన జగనన్న కాలనీలో రికార్డుల్లో లేకుండా ఆరుగురు వ్యక్తులు కాలనీ ఇళ్లు ఎలా నిర్మిం చారని, ఎవరి ప్రోద్బలంతో చేపట్టారని ప్రశ్నించారు. రెవెన్యూ కార్యా లయంలో కాలనీ సమస్య ను ఎవరూ పట్టంచుకోవడంలేదని సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అక్రమంగా ఇళ్లు నిర్మించిన పునాదుల వద్ద బాధితులు, యువకులు నిరసన వ్యక్తంచేశారు.