పూండి-నౌపడ సెక్షన్ లో పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం కె సందీప్ శనివారం తెలిపారు. ఆగస్టు 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12830) గంట ఆలస్యంగా మ. 1. 10 గంటలకు, ఆగస్టు 3న పూరీ-గాంధీధాం (22974) గంటన్నర ఆలస్యంగా మ. 12. 45 గంటకు, భువనేశ్వర్-తిరుపతి (22879) గంట ఆలస్యంగా మ. 1. 10 గంటకు బయలుదేరుతుంది. ఈ నెల 29, ఆగస్టు 1, 3 తేదీల్లో విశాఖ-పలాస–విశాఖ మాత్రమే రాకపోకలు సాగిస్తుంది.