వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తిచేసి ఆలూరు ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించాలని సిపిఐ యం.యల్ లిబరేషన్ పార్టీ నాయకులు మునిస్వామి ఆధ్వర్యంలో పెద్ద హోతూరు గ్రామ సచివాలయం ముందు శనివారం ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతం ఆలూరు ప్రాంతమని తాగునీరు అందక చాలా గ్రామంలో ప్రజలు కష్టాలు పడుతున్నారని తెలియజేశారు