చీరాల నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం బీచ్ లలో ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదివారం పర్యటించారు. బీచ్ లలో వరుస ప్రమాదాలను అరికట్టేందుకు అమలు చేస్తున్న నూతన ఆంక్షలపై పర్యాటకుల నుండి అభిప్రాయ సేకరణ జరిపారు. పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్ లలో ఆంక్షలు అమలు చేస్తున్నామని, పర్యాటకులు సహకరించాలని ఎమ్మెల్యే కొండయ్య కోరారు.