గుడిపల్లి మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. చెన్నై - బెంగళూరు ప్రధాన రైల్వే మార్గంలోని గుడిపల్లి వద్ద నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు చేస్తుంటాయి. రైలు వచ్చినప్పుడు గేటు మూసేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో రైల్వే శాఖ 25. 5 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు టీడీపీ నాయకులు ఆదివారం తెలిపారు.