ముసునూరు మండలం రమణక్కపేటలో అరుంధతీ నగర్ ఎస్సీ కాలనీలో సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్క రించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రమణక్కపేటలో ఆ పార్టీ కమిటీ సమావేశం నిర్వహించి తీర్మానాలు ప్రవేశపెట్టారు. గ్రామంలో పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలన్నారు. తూర్పు ఎస్సీ కాలనీకి మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa