తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి మంత్రి కొలుసు పార్థసారథి సాగునీరు విడుదల చేశారు. ఆదివారం చాట్రాయి మండలం పోతనపల్లి పంచాయితీ పరిధిలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కుడికాలువ నుంచి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేశారు. 9, 169 ఏకరాల భూమి ఈ నీటి ద్వారా సాగవుతుంది. 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది.