రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ ను నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రానా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నంద్యాల జిల్లా ఎస్పీగా రానా పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, గంజాయి నాటు సారా నిర్మూలన, శాంతిభద్రతల పర్యవేక్షణ తదితర అంశాలపై ఎస్పీతో మంత్రి సమగ్రంగా చర్చించారు.