ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువులు, కొండల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సిజ్ చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం నల్లమడ మండల పరిధిలోని రెడ్డిపల్లి, వేళ్ళ మద్ది, ఎర్రవంకపల్లి గ్రామాల పరిధిలో ఆయన పర్యటించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పరిశీలించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.