గార్లదిన్నె మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టుకు హాజరుపరిచారు. వారి నుండి 20 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. సుమారు 4, 11, 000 రూపాయలు నగదు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలియజేశారు.