ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కంబాలపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.