కళ్యాణదుర్గం మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పారిశుద్ధ్యంపై సిబ్బందిని నిలదీశారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసే లేఔట్లు, గృహ నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.