రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ హెచ్ఎల్సీ ఆయకట్టుకు తుంగభద్ర జలాలు చేయడంతో రైతన్నలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పంటలకు సాగునీరు రావడంతో పంటలు వేసే పనిలో రైతన్నలు బిజీగా మారారు. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు వారి వారి పంట పొలాల్లో పంటలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎద్దులతో పొలంలో పనులను ప్రారంభించారు.