కుందుర్పి మండల కేంద్రానికి చెందిన కాపరి వెంకటస్వామి జగనన్న కాలనీ పక్కన ఏర్పాటు చేసుకున్న గొర్రెలదొడ్డిలోకి మంగళవారం గొర్రెలను వదిలి పక్కనే ఉన్న ఇంటిలోకి వెళ్లారు. గొర్రెలు అరవడంతో ఆయన బయటకు వచ్చారు. మందలోకి చిరుత చొరబడటాన్ని గమనించి గట్టిగా కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో చిరుత పక్కనే ఉన్న కొండ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుత దాడిలో ఒక గొర్రె మృతి చెందింది.