ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సురేంద్రబాబు హెచ్చరించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు అందించిన స్థలాలలో గత నాయకుల అండతో వసూళ్లకు పాల్పడి బహిరంగంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే కబ్జాదారులను, వారిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.