శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మంగళవారం నెలకొన్న తాగునీటి, డ్రైనేజ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. మడకశిర పట్టణ సుందరికీకరణకు సహకరించాలని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును కమిషనర్ రంగస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో రాజా, ఉమా శంకర్, సీనప్ప, ప్రభావతి, గంగమ్మ, వెంకట లక్ష్మమ్మ, సావిత్రమ్మ, మేఘన రమేష్, సుధాకర్ నాయక్ కౌన్సిల్ సిబ్బంది పాల్గొన్నారు.