కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్ ఆఫీసులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీవో జాన్ ఇర్విన్ సోమవారం తెలిపారు. తాసిల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్, రికార్డ్ గదులలో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, భూములు, రికార్డుల భద్రతపై ఆయా మండలాల తహశీల్దార్లు బాధ్యత వహించాలని తెలిపారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు కాలిపోయిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.