మినీ గోకులం పథకం కింద మర్రిపూడి మండలానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్లు మంజూరు చేసిందని మండల పశు వైద్యాధికారి శ్రావణి మంగళవారం తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తోందన్నారు. రెండు పశువులకు రూ. లక్షన్నర, నాలుగు ఉన్న వారికి రూ. 1. 85 లక్షలు, ఆరు పశువులకు రూ. 2. 30 లక్షలు యూనిట్లు మంజూరు చేస్తోందన్నారు. గ్రామాలలోని పశు పోషకులు పశువైద్యాధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.