కనిగిరి పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట వీధి వ్యాపారులు సోమవారం ధర్నా చేశారు. ఇటీవల ట్రాఫిక్ సమస్యల కారణంగా మున్సిపల్ అధికారులు పట్టణంలో రహదారులకు ఇరువైపులా వీధి వ్యాపారుల బంకులను తొలగించడంతో ఉపాధి కోల్పోయిన వారంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపాలని డిమాండ్ చేశారు.