ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం అందిస్తున్నారని ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి వేదిక కన్వీనర్ జి. నాగరాజు విమర్శించారు. సోమవారం ఆయన హాస్టల్లో విద్యార్థులకు మధ్యాహ్నం వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయన్నారు. మెనూ ప్రకారం సక్రమంగా అందించలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.