ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారులో శృంగారం.. కంట్రోల్ తప్పి డివైడర్‌ను

national |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 11:15 PM

ఓ యువతి, ఇద్దరు యువకులు కదులుతున్న కారులోనే శృంగారం చేసిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. పైగా ఆ కారులో నలుగురు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. ఇలా నడిరోడ్డుపై కారులో ఓ పక్క ముగ్గురూ శృంగారం చేసుకుంటుండగానే.. డ్రైవర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. అయితే ఏదో ప్రమాదం జరిగిందని స్థానికులు వచ్చి కారులో చూడగా.. అసలు బండారం బయటపడింది. ఆ కారులో ఒక యువతి, ఇద్దరు యువకులు బట్టలు లేకుండా నగ్నంగా కనిపించడంతో.. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కాన్పూర్‌లో కదులుతున్న కారులోనే నలుగురు పిల్లల ముందు ఓ యువతి, ఇద్దరు యువకులు బరితెగించి శృంగారంలో పాల్గొనడం సంచలనంగా మారింది. రోడ్డుపై వెళ్తున్న ఆ కారులో యువతీ యువకులు మద్యం తాగి ఉన్నారు. అంతటితో ఆగకుండా.. కామం ఆపుకోలేక ఓ యువతి అదే కారులో ఉన్న మరో ఇద్దరు యువకులతో శృంగారం చేసింది. ఓ పక్క కారు వేగంగా దూసుకెళ్తుండగానే.. మరోవైపు.. ఆ యువతి, ఇద్దరు యువకులు తమ శృంగారంలో మునిగితేలిపోయారు. అయితే మధ్యమధ్యలో ఆ కారు డ్రైవర్ వెనక్కి తిరిగి మరీ.. ఆ శృంగార క్రీడను చూడగా.. ఆ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.


అయితే ఆ ప్రమాదాన్ని చూసిన స్థానికులు.. ఆ కారులో ఉన్నవారిని కాపాడేందుకు పరుగు పరుగున దాని వద్దకు చేరుకున్నారు. అయితే కారులో చూడగా.. ఇద్దరు యువకులు, ఒక యువతి శృంగారం చేస్తూ కనిపించారు. వారు బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా కనిపించడంతో వారు అవాక్కయ్యారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ కారులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో స్థానికులు వారిని తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఆ యువతి, యువకులపై తీవ్రంగా మండిపడుతున్నారు.


ఇక కారులో ఉన్న చిన్న పిల్లల్లో ఒకరు బయటకు దిగి స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ యువతీ యువకులు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించి వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పతికి తరలించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com