గుంతకల్లులోని పాత గుంతకల్లులో వెలసిన శ్రీ హజరత్ సయ్యద్ మస్తాన్ వలీ స్వామి 389వ ఉరుసు సందర్భంగా దర్గా ప్రాంతంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య పర్యటించారు. ఉరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు నిర్వహిస్తున్న సౌకర్యాలను దర్గ వక్ఫ్‌బోర్డ్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ తరుపున తాగునీరు, శానిటేషన్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఇంజనీర్ గుర్రప్ప యాదవ్ ను ఆదేశించారు.