శింగనమల మండలం గురుగుంట్ల గ్రామానికి చెందిన వరికూటి ఓబులపతి కుమారుడు ధనుష్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓబుళపతి కుటుంబాన్ని చామలూరు రాజగోపాల్, పట్నం నాగేష్, బిల్లే నారాయణస్వామి, భాస్కర్ నాయక్ పరామర్శించారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించారు. ధనుష్ ఆత్మకు శాంతి కలగాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నామని వారు తెలియజేశారు.