పర్చూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు నూతన తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి నియమించారు. పర్చూరులో పి. బ్రహ్మయ్య, కారంచేడులో కె. నరసింహారావు, చిన్నగంజాంలో జే. ప్రభాకరరావు, యద్దనపూడిలో కే. రవికుమార్, మార్టూరులో టి. ప్రశాంతిలకు తహసీల్దారులుగా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం రాత్రి ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు అయితే ఇంకొల్లు తహసీల్దార్ గా ఎవరినీ నియమించలేదు.