ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ కూల్ డ్రింక్ షాప్ లో పనిచేస్తున్న సేల్స్ మెన్ ప్రసాద్ 8లక్షల రూపాయలు కాజేశారని కూల్ డ్రింక్ షాప్ యజమాని సుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై అబ్దుల్ రెహమాన్ బుధవారం తెలిపారు. పరిసర ప్రాంతాలలోని దుకాణాలకు సరఫరా చేసిన కూల్ డ్రింక్స్ సంబంధించిన నగదు సుమారు రూ.8 లక్షలు ఇవ్వకుండా మోసం చేశారని యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.