శ్రీకాకుళం జిల్లా నందిగాంలోని అంబేద్కర్ గురుకులకళాశాలలో ఇంటర్ విద్యార్థిని అర్చిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.