అద్దంకి మండలంలో ఆగస్టు ఒకటో తేదీన 7, 118 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సత్యనారాయణ బుధవారం తెలియజేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తారని ఆయన చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ ఇంటి వద్ద ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa