సింహాద్రిపురం మండలం రావులకోలనులో దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె(14) తల్లి సంరక్షణలో ఉంటోంది. ఈనెల 28న ఫోనులో తండ్రికి కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంది. విషయం తల్లికి తెలియడంతో కుమార్తె చేతులపై వాతలు పెట్టింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పులివెందులకు తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి కూతురితో కలిసి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.