ఉపాధి హామీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి శేఖర్ యాదవ్, అడిషనల్ పీడీ నాగరత్నమ్మ, ఎపిడి జుబేదా, ఎంపీడీవో కులాయమ్మ, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.