ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రొద్దుటూరు స్థానిక వైవీఎస్ మున్సిపల్ బాలికల హైస్కూల్, వైఎంఆర్ కాలనీలోని అరబిందో ఇంటిగ్రల్ హైస్కూల్లో సీజనల్ వ్యాధులు, స్టాప్ డయేరియా, కుష్టు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ హిమబిందు, డీపీఎంఓ శివశంకరయ్య, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.