2024 ఒలింపిక్స్‌లో టీమ్ ఇండియా దేశం గర్వించేలా మనుభాకర్, సరబ్జోత్ సింగ్ జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించి దేశం గర్వించేలా చేశారంటూ వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం పట్ల వైయస్ జగన్ అభినందనలు తెలుపుతూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. కొరియా జోడీని భారత షూటర్లు ఓడించారు. అంతకుముందు ఆదివారం, మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన ఖాతాలో మరో పతకం యాడ్ అయ్యింది. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డ్ సృష్టించిన మను.. ఒలింపిక్స్‌లో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి క్రీడాకారణిగా మరో చరిత్ర సృష్టించింది.